సుస్థిర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధన పై సోమవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, సుస్థిర లక్ష్యాల సాధనలో గ్రామ వార్డు సచివాలయాలను యూనిట్ గా చేయాలని, అక్కడి సిబ్బందిని పూర్తిస్థాయిలో భాగస్వాములు చేయాలని ఆదేశించారు.
ప్రగతి లక్ష్యాల సాధన పై ప్రతి నెలకోసారి వివరాలు నమోదు కావాలని, దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను వాడుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ పిల్లలు బడి మానేసారన్నమాట వినిపించకూడదని దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని సీఎం దిశ నిర్దేశం చేశారు. పిల్లలు ఎవరైనా వరుసగా మూడు రోజులు పాఠశాలకు రాకపోతే ఇంటికి వెళ్లి ఆరా తీయాలని, కచ్చితంగా తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ లు పంపాలని అధికారులను ఆదేశించారు.