ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆడపిల్లలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆడపిల్లల రక్షణ కోసం దిశా చట్టాన్ని చేసిన జగన్ దాని కోసం తొలి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేసారు. రాజమండ్రిలో ఈ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేసారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లల రక్షణ కోసం కీలక అడుగు వేసినట్లు అవుతుంది. ఇక నుంచి ఆడపిల్ల మీద కన్నుపడాలి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
దిశా కాల్ సెంటర్, దిశా యాప్ ని కూడా జగన్ ప్రారంభించారు. దిశా యాప్ లో sos బటన్ నొక్కితే 10 సెకన్లలో మొబైల్ టీంలు సాయం అందిస్తాయి. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. ఇన్నాళ్ళు ఆడపిల్లలకు భద్రత కరువైందని ఇప్పుడు ఆడపిల్లలకు ఇక భయం లేదని అంటున్నారు. ఇక ఇందుకోసం 52 మంది సిబ్బందితో పాటుగా ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులను నియమించారు.
హైదరాబాద్ లో దిశా ఘటన జరిగిన రోజుల వ్యవధిలో జగన్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం దాన్ని ఆమోదించడం జరిగాయి. దీని ద్వారా 7 రోజుల్లో విచారణ పూర్తి చేసి, ఏడు రోజుల్లో తీర్పు ఇచ్చి 7 రోజుల్లో ఉరి తీస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 18 పోలీస్ స్టేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఎంపీలు కృషి చేయనున్నారు.
ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందితే ఈ బిల్లు అమలులోకి రానుంది. దీనిపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. తెలంగాణా, సహా కీలక రాష్ట్రాలు అన్నీ ఈ బిల్లు పై దూకుడు పెంచాయి. ఇది అమలులోకి తీసుకువస్తే దేశ వ్యాప్తంగా మహిళలపై దాడులు దాదాపుగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న చట్టాలతో దోషులను ఉరి తీయడం అనేది దాదాపుగా అసాధ్యమని భావించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.