ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని ఆగడం లేదు. నిన్న కూడా భారీగా కేసులు వచ్చాయి. పది వేలకు పైగా కరోనా కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి. కరోనా కేసులు ఈ రేంజ్ లో నమోదు కావడంపై సిఎం జగన్ ఇప్పుడు ఆరోగ్య, రెవెన్యు శాఖల పని తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. అసలు కరోనా టెస్ట్ లు ఎవరూ చేయని విధంగా చేస్తున్నా ఎందుకు కేసులు ఇలా పెరుగుతున్నాయి అని ఆయన నిలదీసినట్టు తెలుస్తుంది.
కరోనా కట్టడి కోసం ఎవరూ చేయని విధంగా వైద్య రంగంలో మార్పులు చేసామని, కాని ఎందుకు కేసులు పెరుగుతున్నాయో తనకు రెండు రోజుల్లో నివేదిక కావాలి అని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణాలో కేసులు ఎందుకు తగ్గాయి మన దగ్గర ఎందుకు పెరిగాయి అనేది తనకు పూర్తి స్థాయిలో నివేదిక కావాలి అని ఆయన ఆదేశాలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.