జగన్ సంచలన నిర్ణయం : 48 వేల మంది కి ఉపాధి

-

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో ఇవాళ స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టుల పై బోర్డులో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే దిశగా రానున్నాయి పలు కిలక ప్రాజెక్టులు. అలాగే ఒక్కో ప్రాజెక్టు పై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం అందుతోంది.

వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా దాదాపు 48 వేల మందికి ఉద్యోగ అవకాశం కలుగనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 1564 హోటల్ గదులు అందుబాటులోకి రానున్నాయి. ఐదేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించిన ఏపీ సర్కార్. విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీ హిల్స్, పిచ్చుకలంకలో రిసార్టులు రానున్నాయి. ప్రముఖ సంస్థ ఓబెరాయ్‌ ఆధ్వర్యంలో కూడా రిసార్టులు రానున్నాయి.

పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలని వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలని.. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆధునిక వసతులు అందుబాటులోకి రావడంతో టూరిజం పరంగా రాష్ట్ర స్ధాయి పెరుగుతుందన్నారు. పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version