Big Breaking : ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలును వాయిదా

-

ప్లాస్టిక్‌ బ్యానర్ల వినియోగాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మంగళవారం నుంచి అమలు కానుండగా.. ఈ ఉత్తర్వులను వాయిదా వేసింది ప్రభుత్వం. ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నవంబర్ 1 నుంచి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం… తన నిర్ణయాన్ని సవరిస్తూ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమధ్య విశాఖ పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… నగరంలో వెలసిన ప్లాస్టిక్ ఫ్లెక్సీలను చూసి.,. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు బదులుగా వస్త్రంతో చేసిన ఫ్లెక్సీలను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచే రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించనున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలుకు ఒక్క రోజు ముందుగా సోమవారం (అక్టోబర్ 31) ఈ వ్యవహారంపై ఓ కీలక నిర్ణయన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలును వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీ తయారీదారుల వినతి మేరకు నిషేధం అమలును వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 26 నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version