కేరింత’ సినిమా లో నూకరాజు లవర్ గా చేసిన భావనపెళ్లి చేసుకుంది. ఈమె అసలు పేరు సుకృతి. ఇక సినిమా అంతా నూకరాజు భావన, భావన అంటూ ఈమె పేరు పలవరిస్తూ ఉంటాడు. ఆ సినిమాతో వీరిద్దరికీ మంచి పేరు వచ్చింది.
సుక్రుతి తాజాగా అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడింది. బంధువులు, కుటుంసభ్యుల సమక్షంలో సోమవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.ఇది చూసిన నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు.
కేరింత సినిమాతో ఇండస్ట్రీకి పరిచమయైన సుకృతి చేసింది ఒక్క సినిమా అయినా తన నటనతో మెప్పించింది.అయితే ఏమైందో ఏమో కానీ కేరింత సినిమా తర్వాత మళ్లీ ఎక్కడా సినిమాలలో కనపడలేదు.కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తనకి సంబంధించిన పలు విషయాలను తన ఫాలోయర్స్ తో పంచుకుంటూ వుంటుంది.