ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో మంత్రి విడుదల రజిని, ఏపీ సీఎస్, తదితరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, నాయకులు ఆసుపత్రులను సందర్శించాలని సూచించారు. మార్చి ఒకటి నుంచి గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగి మాల్ట్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని బోధనసుపత్రుల్లో క్యాన్సర్ నివారణ పకారాలు, చికిత్సలతో పాటు క్యాథ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.