పోలవరాన్ని ప్రారంభించింది YSR.. అది పూర్తి చేసే ది ఆయన కొడుకే అని ఏపీ సీఎం సీఎం జగన్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇవాళ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టు పనులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు.
పోలవరం అంటే వైఎస్సార్.. పోలవరాన్ని ప్రారంభించింది వైఎస్సారే.. అది పూర్తి చేసేది ఆయన కొడుకే.. పోలవరం అని పలికే అర్హత కూడా టీడీపీ లేదని విమర్శలు చేశారు సీఎం వైఎస్ జగన్. ఐదేళ్లలో చంద్రబాబు పోలవరానికి ఏం చేశారు..? దాచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు విధానం అని ఆగ్రహించారు. టీడీపీ ప్రభుత్వం నిధుల పారుదల మీదే దృష్టి పెట్టింది.. పోలవరం అంటే చంద్రబాబుకు ఏటీఎం.. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు సీఎం జగన్.