మసాలాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తినడం, మద్యపానం, ధూమపానం అతిగా చేయడం, టైముకు భోజనం చేయకపోవడం, కారం ఎక్కువగా తినడం.. తదితర అనేక కారణాల వల్ల మనలో అధికశాతం మందికి అసిడిటీ సమస్య వస్తుంటుంది. అయితే ఆ సమస్యకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!
అసిడిటీని తగ్గించడంతో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. తేనె జీర్ణాశయం లోపలి పొరకు రక్షణనిస్తుంది. అలాగే జీర్ణాశయంలో యాసిడ్లు ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చూస్తుంది. దీంతోపాటు కడుపునొప్పి సమస్యను కూడా తగ్గిస్తుంది. అసిడిటీ ఉన్నవారు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టీస్పూన్ల తేనె కలుపుకుని తాగితే సమస్య నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
గుమ్మడికాయ విత్తనాలలో ఉండే పోషకాలు మన జీర్ణాశయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్లను తగ్గిస్తాయి. కనుక ఆ విత్తనాలను తినడం వల్ల అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
ఆలుగడ్డలు లేదా బీట్‌రూట్‌లను తినడం వల్ల కూడా అసిడిటీ సమస్య తగ్గుతుంది.
అసిడిటీ ఉన్నవారు గ్రీన్ టీ తాగితే వెంటనే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. గ్రీన్ టీ వల్ల జీర్ణ సమస్యలు పోతాయి.