ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు ఎస్పీలకు పలు సూచనలు సలహాలు ఇస్తూ… దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అధికారులందరూ సీరియస్గా పని చేస్తున్నారని ఈ
సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలకు 15000 ప్రభుత్వం కేటాయిస్తు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో మానవత్వం మరుగున పడుతున్న పరిస్థితులు చూస్తున్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కరోనా వైరస్ పై అవగాహన పెంచుకుని ధైర్యంగా… కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలి అంటూ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..