Breaking : గవర్నర్‌ నజీర్‌ను కలిసిన సీఎం జగన్‌

-

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మండలి ఎన్నికల ఫలితాల తరువాత సీఎం జగన్ కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లాలో పర్యటన ముగించుకున్న సీఎం జగన్ సాయంత్రం విజయవాడ వచ్చారు. రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. విశాఖలో జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్ కు తెలియజేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్టు తెలుస్తోంది. రేపు విశాఖలో జీ-20 సమావేశం జరగనుంది. ఈ సదస్సులో దేశ విదేశీ అతిథులు పాల్గొననున్నారు.

ఇప్పటికే చాలామంది విశాఖ చేరుకున్నారు. ఈ సదస్సు కోసం సీఎం జగన్ రేపు విశాఖ వెళుతున్నారు. కేంద్ర మంత్రులు కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొననున్నారు. విశాఖలో జీ-20 సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ సర్కారు అతిథుల కోసం ఘనంగా విందు ఏర్పాటు చేస్తోంది

 

Read more RELATED
Recommended to you

Exit mobile version