ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ మరో షాక్.. ఆ పన్నులు కట్టాల్సిందే !

-

ఏపీ ప్రజలకు జగన్‌ సర్కార్‌ మరో షాక్ ఇచ్చింది. పట్టణాల్లో ఇళ్ల స్థలాల క్రమ బద్దీకరణ పేరుతో రుసుములు చెల్లించాలని పేదలకు ఇప్పటికే తాఖీదులిచ్చిన ఏపీ సర్కార్‌.. లేఅవుట్లలో ఎప్పుడో స్థలాలు కొన్న వారికి వ్యవసాయేతర భూమి పన్ను కట్టాలని ప్రస్తుతం నోటీసులు ఇచ్చింది. అప్పులు చేసి ప్లాట్లు కొన్న కుటుంబాలు లక్షలాది రూపాయలు చెల్లించాలంటే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

లేఅవుట్లకు అనుమతులిచ్చినప్పుడే.. వ్యాపారులు నాలా పన్ను చెల్లించారా లేదా పరిశీలించకుండా.. అనేక ఏళ్ల తర్వాత కొనుగోలు దారులకు బాధ్యులను చేయడంపై ఆవేదన చెందుతున్నారు. పన్ను చెల్లించని ప్లాట్ల క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్‌ రిజిస్ట్రార్లను సర్కార్‌ ఆదేశించడం మరింత కలవరపెడుతోంది.

విజయవాడలో వందకు పైగా లేఅవుట్ల నుంచి నాలా పన్ను వసూలు చేయడానికి రెవెన్యూ శాఖ సిద్దం అయింది. మిగతా నగరాల్లోనూ అదే విధంగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమౌవుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో రూ.500 కోట్లకు పైగా పన్ను వసూలు చేయాలన్నది లక్ష్యంగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version