ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పట్టాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అన్ని కార్యక్రమాలూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 97.83 శాతం ప్లాట్ల విభజన పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారని… మిగతావాటిని కూడా పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్లాట్ల లబ్ధిదారుల జాబితాలు డిస్‌ప్లే అవుతున్నాయా? లేదా? చెక్ చేయాలన్నారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో పట్టాలు ఇస్తామని చెప్పామని… ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం తెలిపారు.
కొవిడ్ పరిస్థితులు తగ్గగానే నేను కూడా రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తా. ఇళ్లపట్టాలకు సంబంధించి 30 లక్షల మందికి రూ. 22,355 కోట్లు ఖర్చు అవుతోంది. రూ.7,700 కోట్ల విలువైన 25,462 ఎకరాల ప్రభుత్వ భూములు, రూ.9,200 కోట్ల విలువైన 23,262 ఎకరాల ప్రైవేటు భూములు, రూ.1350 కోట్ల విలువైన 4,457 ఎకరాల ల్యాండ్ పూలింగ్ భూములు, రూ. 325 కోట్ల విలువైన 1,074 ఎకరాల సీఆర్డీయే భూములు, రూ. 810 కోట్ల విలువైన 2,686 ఎకరాల టిడ్కో భూములు, పొజిషన్ సర్టిఫికెట్ల ద్వారా రూ. 2,970 కోట్ల విలువైన 9,900 ఎకరాల భూములు మొత్తం రూ. 22,355 కోట్ల విలువైన 66,842 ఎకరాల భూములను 30 లక్షల మంది పేద కుటుంబాలకు ఇళ్లపట్టాల రూపంలో ఇవ్వబోతున్నాం అని సీఎం జగన్ అన్నారు.