ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులకు సహాయం అందించడానికి గతంలో ఎప్పుడు లేని విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ముంపు గ్రామాల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించడానికి చర్యలు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. పరిహారం అందనివారికి మరింత గడువు ఇచ్చి పూర్తి పరిహారం ఇస్తామని ఆయన శుభవార్త చెప్పారు. ముంపు గ్రామాలను తరలించేందుకు వారికి త్వరగా పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు సీఎం జగన్. పరిహారం చెల్లించేందుకు 20వేల కోట్లు అవసరం వుంది.. దీనికి కేంద్రం నుంచి సహకారం అవసరమని, కేంద్రం నుంచి మనకి రావాల్సిన బకాయిలు చాలా వున్నాయి..ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిలో చలనం ఉండటంలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన పరిహారం అందించే ఏర్పాటు చేస్తామన్నారు.
మోడీ అపాయింట్మెట్ అడిగానని, పోలవరం నిర్వాసితులంతా మిమ్మల్నే తిట్టు కుంటున్నారు అని చెప్తానన్నారు. పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వివరించారు సీఎం జగన్. గట్టిగా అడుగుతానని, మీకు పరిహారం ఇస్తే నే ప్రాజెక్టులో నీళ్ళు నింపుతామన్నారు. 41.15 కాంటూరు పరిధిలోకి వచ్చే వారికి సెప్టెంబర్ నాటికి పరిహారం ఇస్తామని తెలిపారు. పునరావాసం కలుస్తామని, నిర్వాసితుల గతంలో ఎకరాకు ఇచ్చిన లక్షా లక్షా పది హెను వేల పరిహారాన్ని అదనంగా కలిపి మొత్తం 5 లక్షలు ఇస్తామన్నారు. నిర్వాసితుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు.