ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన విషయంలో ఏ స్థాయిలో దూకుడుగా వెళ్తున్నారో అందరికి తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఆయన దూకుడుగా అడుగులు వేస్తున్నారు. ప్రజల్లో ముందు వ్యతిరేకత వచ్చినా క్రమంగా జగన్ ఆలోచన ఏంటీ అనేది అర్ధం కావడంతో జగన్ దూకుడు ఇప్పుడు అందరికి నచ్చుతుంది.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన, అంటే మాజీ ప్రజా ప్రతినిధులకు ఉన్న గన్ మెన్లను ఉపసంహరించాలని జగన్ భావిస్తున్నారు. ఖర్చు ఆదా చేసే యోచనలో ఉన్న జగన్ ఈ విధంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వలో దీనిపై ఒక జీవో కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
గత ఎన్నికల్లో అనేక మంది మంత్రులు, ఎంపీలు, ముఖ్యనేతలు ఓటమి పాలయ్యారు. వారిలో చాలా మంది భద్రతకు ముప్పు ఉంది. అటు కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన వారి భద్రతకు కూడా ముప్పు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా వ్యవహరించిన ఎందరో మాజీ మంత్రులకు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. దీనితో టీడీపీ, కాంగ్రెస్ నేతల నుంచి ఎక్కువ వ్యతిరేకత వచ్చే అవకాశం కనపడుతుంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.