ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఒక్కో ఉద్యోగి ఎప్పుడు ఏ తనిఖీ జరుగుతుందా అని ఆందోళనలో ఉంటున్నాడు. అవును ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతి అధికారుల భరతం పడుతున్నారు అధికారులు. ఇటీవల జగన్ నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతో అధికారులు చెలరేగిపోతున్నారు.
ఒక్కో శాఖను టార్గెట్ చేస్తున్నారు. వరుసగా దాడులు చేస్తున్నారు. అవినీతి అధికారి అనే సమాచారం వస్తే చాలు… అధికారులు దాడులు చేస్తున్నారు. వరుసగా ఆఫీసుల్లో ఇళ్ళల్లో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. కోట్లాది రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి సమాచారం లేకుండా దాడులు చేస్తున్నారు అధికారులు.
బంగారం, డబ్బు, ఇతర ఆభరణాలు ఏమి ఉన్నా సరే లెక్కలు సరిగా లేకపోతే స్వాధీనం చేసుకుంటున్నారు. ఏ సమాచారం కూడా ముందస్తుగా లేకుండా అసలు వార్త కూడా బయటకు రాకుండా దాడి చేసిన తర్వాత మీడియాకు సమాచారం ఇస్తున్నారు అధికారులు. వందల కోట్లను మింగేసిన అధికారులను తక్షణమే విధుల నుంచి కూడా తప్పిస్తున్నారు. ఇక జగన్ ఆదేశాలు ఉండటంతో ఏసీబీకి అడ్డు చెప్పే వారే లేకుండాపోయారు.