వైసీపీ నేతలకు షాక్‌.. వారికి టికెట్లు ఇవ్వను : సీఎం జగన్‌

-

వైసీపీ నేతలకు సీఎం జగన్‌ షాకిచ్చే విషయం చెప్పారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం
కార్య‌క్ర‌మంపై సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షుడు, రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లు పాల్గొన్న ఈ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ప‌నిచేసిన వాళ్ల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తాన‌న్నారు సీఎం జ‌గ‌న్. త‌న మీద అలిగినా ఫ‌ర‌వా లేద‌ని, ప‌నిచేయ‌ని వాళ్ల‌కు టికెట్లు ఇచ్చే ప్ర‌సక్తే లేద‌ని సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పారు. త‌న‌తో పాటు ఎమ్మెల్యేలు క‌లిసి ప‌నిచేస్తేనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచే అవ‌కాశం ఉంద‌ని కూడా చెప్పారు సీఎం జ‌గ‌న్.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని కొంద‌రు సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌ని చెప్పిన జ‌గ‌న్‌… కార్య‌క్ర‌మాన్ని ఐదుగురు ఎమ్మెల్యేలు కేవలం ఐదు రోజుల్లోనే ముగించార‌ని చెప్పారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో ఒక్క రోజు మాత్ర‌మే తిరిగిన వారి జాబితాలో మాజీ మంత్రి ఆళ్ల నాని, న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి ఉన్నార‌ని చెప్పారు. మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి అయితే కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నార‌ని తెలిపారు సీఎం జ‌గ‌న్. ఐదుగురు మంత్రులు క‌నీసం ప‌ది రోజులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేద‌ని తెలిపారు సీఎం జ‌గ‌న్. మొత్తం ఎమ్మెల్యేంద‌రి ప్రొగ్రెస్‌ను జ‌గ‌న్ స‌మీక్ష‌లో బ‌య‌ట‌పెట్టారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version