ఇవాళ అభివృద్ది పథకాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 10న నేతన్న నేస్తం అమలు చేస్తామని పేర్కొన్న సీఎం జగన్.. విద్యా కానుక పథకాన్ని ఆగస్టు 16న అమలు చేస్తామని స్పష్టం చేశారు.
అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు సిఎం జగన్ ఈ సందర్భంగా తీపి కబురు చెప్పారు. రూ. 20 వేల లోపు డిపాజిట్‌చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24 న డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఆగస్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తామని.. ఈమేరకు కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు సీఎం జగన్.
గ్రామ స్థాయిలో పని చేయని అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు సీఎం జగన్. గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్ చేసుకోవాలని.. వీటి సమర్థ మెరుగుపడాలంటే ఇనస్పెక్షన్ జరగాలని పేర్కొన్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు ఇనస్పెక్షన్లు చేయాలని ఆదేశించారు. వారానికి రెండు సార్లు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు 4 సార్లు, మున్సిపల్‌కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి 4 సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని గతంలోనే చెప్పమన్నారు.