తిరుమల : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి తిరుమల పర్యటన కు వెళ్లనున్నారు. అక్టోబర్ మాసం 11 వ తేదీన ఏపీ సిఎం జగన్ తిరుమలలో పర్యటించనున్నారు. గరుడ సేవ రోజున స్వామి వారికి పట్టు వస్ర్తలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం తరపున సమర్పించనున్నారు సిఎం జగన్.
అంతే కాదు అదే రోజున అలిపిరి వద్ద 13 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన గో మందిరం మరియు తిరుమల లో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు బూందీ పోటు ను ప్రారంభించనున్నారు సిఎం జగన్. గో మందిరంకు 13 కోట్లు విరాళం మాజీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి అందించగా….అదనపు పోటు కు 20 కోట్లు పాలకమండలి సభ్యుడు శ్రీనివాసన్ విరాళం అందించారు. ఇక సిఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యం లో అధికారులు అన్నీ ఏర్పాట్ల కు సిద్దమయ్యారు. కాగా వచ్చే నెల 7 నుంచి శ్రీ వారి బ్రహ్మోత్సవాలు జరుగన్నాయి.