తిరుమలకు నడక మార్గాన్ని ప్రారంభించిన సిఎం జగన్…

తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి… తిరుమల పర్యటన లో చాలా బిజీ అయిపోయారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరుమల బయలు దేరిన సీఎం జగన్‌ కాసేపటి క్రితమే.. రేణిగుంట విమానాశ్రయం లో దిగారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం తిరుపతి లోని.. బర్డ్ లో రూ. 25 కోట్ల రుపాయిల వ్యయంతో ఏర్పాటు చేసిన పద్మావతి చిన్న పిల్లలు హస్పిటల్ ప్రారంభించారు సిఎం జగన్. ఆ కార్యక్రమం అనంతరం అలిపిరి వద్దకు నూతనంగా రూ. 25 కోట్లతో అభివృద్ధి చేసిన శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గాన్ని ప్రారంభించారు సిఎం జగన్.

అలాగే… అలిపిరి వద్ద రూ. 15 కోట్లుతో నిర్మించిన గో పూజ మందిరాన్ని ప్రారంభించారు సిఎం జగన్. అనంతరం అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గో తులభారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల అనంతరం.. నేరుగా తిరుమల బయలు దేరారు సీఎం జగన్‌. రేపు ఉదయం శ్రీవారిని సీఎం జగన్‌ దర్శించుకోనున్నారు.