ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సి ఎస్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఫసల్ బీమా యోజన మరియు రైతు భరోసా వంటి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు తెలియజేశారు.
రానున్న కాలంలో రైతులకు ఏ విధంగా సహాయ పడాలి, అలాగే నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికల గురించి సమావేశం అయినట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చే లా చర్యలు తీసుకోనున్నారు. రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై చర్చించనున్నారు.