ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఇప్పట్లో ఆమోదం పొందే అవకాశాలు లేవా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు దీనిపై తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఆయన పార్టీ సీనియర్ నేతలతో తన నివాసంలో ఇప్పటికే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. దీనితో జగన్ ఇప్పుడు ఎం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
బిల్లు సెలెక్ట్ కమిటికి వెళ్ళిన నేపధ్యంలో జగన్ ఆర్డినెన్స్ తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే అది అంత సాధ్యం కాదని న్యాయ, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం చూస్తే ఒక బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాక దానిపై ఆర్డినెన్స్ తీసుకురావడం అసాధ్యమట. అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. అసలు బిల్లులు సజీవంగా ఉన్నపుడు అది సాధ్యం కాదని అంటున్నారు. జగన్ సెలక్ట్ కమిటీ నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందని,
అసలు ఆ కమిటిని త్వరగా ఇవ్వాలని బెదిరించే అవకాశం కూడా లేదని అంటున్నారు. సెలక్ట్ కమిటీ నిర్ణయం వచ్చిన అనంతరం, బిల్లును మండలి తిప్పి పంపిస్తే సభలో మరోసారి ఆమోదించాల్సి ఉంటుంది. మళ్లీ మండలికి బిల్లు చేరుతుంది కాబట్టి అప్పుడు కూడా బిల్లును ఆమోదించకుండా మరో నెల పాటు అలాగే ఉంచే అవకాశాలు ఉన్నాయి. ఆర్డినెన్స్ తెచ్చినా గవర్నర్ దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. ఎలా చూసినా సరే నాలుగు నెలల పాటు బిల్లు వాయిదా పడటం ఖాయంగా కనపడుతుంది.