ఈ రోజుల్లో గ్యాస్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. దాని నుంచి బయటపడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే జనానికి తాత్కాలిక ఉపశమనమే గాని పెద్దగా ప్రయోజనాలు మాత్రం ఎక్కడా ఉండటం లేదు. అయితే గ్యాస్ సమస్య ఎందుకు వస్తుంది అనేది చాలా మందికి స్పష్టంగా తెలియదు. గ్యాస్ సమస్యకు ఉప్పు కూడా కారణం అంటున్నారు వైద్యులు. ఉప్పులో ఉండే సోడియం మన,
జీర్ణాశయంలోని పదార్థాలు జీర్ణమయ్యేటప్పుడు వాటిపై కాస్త ప్రభావం చూపిస్తుందట. దీంతో గ్యాస్ బాగా ఉత్పత్తి అవుతుందని పరిశోధకులు గుర్తించారు. అదే విధంగా ఫైబర్ ఉన్న పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కూడా జీర్ణాశయంలో గ్యాస్ బాగా పెరిగిపోతుందని పరిశోధకులు స్పష్టంగా చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యను,
అదుపు చేయాలంటే ఉప్పు తక్కువగా, ఫైబర్ ఒక మోస్తరుగా ఉన్న పదార్థాలను తీసుకోవాలని పరిశోధకులు చెప్తున్నారు. అదే విధంగా దీంతోపాటు అన్ని పోషకాలను సమపాళ్లలో తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుందని చెప్పిన పరిశోధకులు దాని ద్వారా జీర్ణాశయం పరంగా వచ్చే అన్ని సమస్యల నుంచి బయట పడవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు.