ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మచిలీపట్టణం పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలని మంచి లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంటే, దానిని భగ్నం చేయడానికి చుట్టూ రాబందుల్లా కాచుకు కూర్చున్నారని ప్రతిపక్షముపై మండిపడ్డాడు. అమరావతిలో 50 వేల మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటే రాక్షసమూకలు ఈ పవిత్ర యజ్ఞాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారంటూ ఆరోపించారు.
పేదలను వ్యతిరేకించే రాక్షసులతో యుద్ధం చేస్తున్నా: సీఎం జగన్
-