కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్‌ లేఖ

-

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్‌సుఖ్‌మాండవీయతో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొన్న తర్వాత కేంద్ర మంత్రితో సమావేశమైన ముఖ్యమంత్రి… వైద్యకళాళాలలకు అనుమతులపై చర్చించారు. ఈ మేరకు కేంద్రమంత్రికి లేఖ అందించారు సీఎం వైయస్‌.జగన్‌. విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాల కొరత ఏర్పడిందని.. దీని కోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.

cm jagan

కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్య వ్యవస్థ కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నానని… ఈ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించారు. ప్రాథమిక, ద్వితీయ స్థాయిల్లో ఆస్పత్రులను మెరుగుపరుస్తోందని.. పీహెచ్‌సీలు, యుపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏహెచ్‌లు, డీహెచ్‌లు, అంతేకాక ప్రస్తుతం ఉన్న బోధనాసుపత్రులను, నర్సింగ్‌కాలేజీలను అభివృద్ధిచేస్తోందని పేర్కొన్నారు.

గణనీయ రీతిలో ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తోందని… ప్రతి జిల్లాలకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా అత్యాధునిక వైద్యంకోసం అవసరమైన నిపుణులు, ఆరోగ్య సేవలు అందించే మానవవనరులు తయారవుతాయన్నారు. ఏపీలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. మొత్తంగా ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయని… రాష్ట్రంలో ఇదివరకే 11 మెడికల్‌ కాలేజీలు ఉండగా, కేంద్రం పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో కొత్తగా మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చిందని లేఖలో వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version