హోం క్వారంటైన్ లోకి జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి …!

-

ప్రస్తుతం కరోనా దెబ్బకి భారతదేశం విలవిల్లాడిపోతోంది. చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది ఈ కరోనా. ఈ నేపథ్యంలోనే ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా కరోనా సోకి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరికి కరోనా వారిని వదలడం లేదు. ఇకపోతే తాజాగా జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా ప్రభావానికి గురయ్యారు.

hemant_soren

దీంతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తనకు తాను హోం క్వారంటైన్ లోకి వెళ్ళినట్లు సమాచారం. ఆయనతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, కార్యాలయంలోని సిబ్బందిని హోం క్వారంటైన్  లోనే ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీఎం కార్యాలయంలోకి వచ్చే విజిటర్స్ పై కూడా అనేక నిబంధనలను ఏర్పాటు చేశారు. అసలు విషయం ఏమిటంటే… జార్ఖండ్ రాష్ట్ర మంత్రి అయిన మిథిలేష్ ఠాకూర్ కు మంగళవారం నాడు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఇటీవలే ఆ మంత్రి సీఎంతో సమావేశం జరగడంతో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వీయ నిర్బంధం లోకి వెళ్లిపోయారు. అయితే ముఖ్యమంత్రికి ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్ళినట్లు అధికారులు తెలియజేశారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 3056 కేసులు పాజిటివ్ గా  నమోదవగా అందులో 22 మంది ప్రాణాలు వదిలారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version