క్రికెట్ అభిమానులకు నిజంగా ఇది ఊపిరి పీల్చుకునే వార్తే. కరోనా మహమ్మారి కారణంగా దాదాపుగా 117 రోజుల తరువాత బుధవారం క్రికెట్ మ్యాచ్ ఆరంభం అయింది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. సౌతాంప్టన్ వేదికగా 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల మధ్య ఆరంభం కావాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ జరగాల్సి ఉన్నా.. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమవుతోంది.
సౌతాంప్టన్‌లో ప్రస్తుతం చిరుజల్లు కురుస్తోంది. దీంతో ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల మధ్య జరగనున్న మొదటి టెస్టు తొలి రోజు తొలి సెషన్‌కు అంతరాయం ఏర్పడింది. కరోనా కారణంగా ఎన్నో రోజుల నుంచి క్రికెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు మ్యాచ్ చూద్దామనుకున్నారు. కానీ వర్షం పడడంతో వారి ఉత్సాహం నీరుగారిపోయింది. అయితే మొదటి రెండు రోజులు మాత్రమే సౌతాంప్టన్‌లో వర్ష సూచన ఉంది. కానీ మిగిలిన 3 రోజులకు మ్యాచ్‌కు అనుకూలమే. ఇక అది కూడా చిరు జల్లులు మాత్రమే అప్పుడప్పుడు కురిసే అవకాశం ఉంది కనుక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి కాబోదని విశ్లేషకులు అంటున్నారు.
ఏది ఏమైనా.. కరోనా వల్ల క్రికెట్ మ్యాచ్‌లు మిస్ అయిన అభిమానులు మాత్రం ఎట్టకేలకు టీవీల్లో మళ్లీ మ్యాచ్‌లను చూసే భాగ్యం దక్కింది. అయితే ప్రస్తుతానికి క్రికెట్ ఆడుతుంది భారత జట్టు కాకపోయినా.. క్రికెట్‌ను ప్రేమించే వారికి మాత్రం ఈ మ్యాచ్‌లు ఉత్సాహం నింపడం గ్యారంటీ.