బేగంపేట్ నుండి ర్యాలీగా బయలుదేరిన సీఎం కేసీఆర్, యశ్వంత్ సిన్హా

-

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. హైదరాబాదులో ఇవ్వాళ్టి నుంచే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగతున్నాయి. పార్టీ విస్తరణను, మోడీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ ఈ సమావేశాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాదులో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మరియు పలు నాయకులు హాజరు కానున్నారు. కాగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు తక్కువచేసి చూపించే క్రమంలోనే టీఆర్ఎస్ కూడా పక్కా వ్యూహంతో ముందుకు వెళుతుంది.

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో భారీ ర్యాలీని తలపెట్టింది టిఆర్ఎస్. ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో దిగడానికి అంటే కొన్ని గంటల ముందే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో ల్యాండ్ అయ్యారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు బేగంపేట ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ శ్రేణులు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జలవిహార్ వరకు భారీ ర్యాలీ తో బయలుదేరారు. ర్యాలీ అనంతరం జలవిహర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సమావేశం అవుతారు. ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్ఎస్ నాయకులతో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version