సపాయన్న.. నీకు సలామన్నా.. అయ్యమ్మకన్నా ఎక్కువ మీరే : సీఎం కేసీఆర్

-

కరోనా వచ్చే అవకాశం ఉందీ అనగానే అధికారులతో పాటు వాలిపోతారు. వెంటనే మాస్కులు ధరించి ఎక్కడిక్కడ శానిటేషన్ చేయడం, చిన్న స్థలాన్ని కూడా వదలకుండా జాగ్రత్తగా చేస్తూ శుభ్రం చేస్తారు. కరోనా వస్తుందని ప్రజలు బయటకు రాకపోయినా సరే వాళ్ళు మాత్రం బయటకు వచ్చి ధైర్యంగా పని చేస్తారు. వాళ్ళు కూడా మనుషులే కదా… వాళ్లకు కుటుంబాలు ఉంటాయి, పెళ్ళాం, పిల్లలు, అమ్మా నాన్న ఎందరో ఉంటారు.

కాని ఎక్కడా కూడా వాళ్ళు తమ కుటుంబాల గురించి ఆలోచించడం లేదు. దేశం కోసం సైనికులు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో అదే విధంగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళే సఫాయి కార్మికులు. మనం అపార్ట్మెంట్ లో ఉండి నానా మాటలు అంటూ ఉంటాం. మున్సిపాలిటి వాడూ అని చీప్ గా మాట్లాడుతూ ఉంటాం. కాని వాళ్ళు లేకపోతే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు లేకపోతే వైద్యులు నరకం చూస్తారు.

వైద్యులు పోరాటం చేస్తున్నా సరే వాళ్ళు ప్రతీ గ్రామంలో, ప్రతీ వీధిలో, ప్రతీ పట్టణం ఇలా ప్రతీ ఒక్కటి కూడా వాళ్ళు శుభ్రం చేస్తున్నారు. లక్షల కోట్ల విలువ అయిన ఐటి కంపెనీ అయినా సరే వాళ్ళు శుభ్రం చేయకపోతే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఇప్పుడు కనపడే దేవుళ్ళు అనేది వాస్తవం. వాళ్ళు లేకపోతే దేశం శవాల దిబ్బ. ఇప్పుడు వారిని చాలా గౌరవించుకోవాలి.

దండం పెట్టుకుని వాళ్ళను కొనియాడాలి. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్… వాళ్లకు ప్రోత్సాహకాలు అందించారు. 5 వేలు 7 వేలు చొప్పున పారిశుధ్య కార్మికులకు ఆయన వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సర్వత్రా ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళను మనం గౌరవించాలి తల్లి తండ్రుల తర్వాత వాళ్ళే అంటూ కేసీఆర్ వారి సేవలను గుర్తించారు. ప్రపంచం మొత్తం కూడా వారి సేవలను గుర్తించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. నిజంగా వాళ్ళు ఒక దేశానికి కాదు ప్రపంచానికే సైనికులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version