దేశంలో జనం చస్తున్నా ఉగ్రవాదుల మీద అమెరికా దాడులు…!

-

కుక్క బుద్ధి మారదు అని తిడుతూ ఉంటారు. ప్రధానంగా అగ్ర రాజ్యం అమెరికా బుద్ధి అసలు మారదు. ఒక పక్క దేశంలో కరోనా వైరస్ తో జనాలు చస్తుంటే అమెరికా బుద్ధి మాత్రం మారడం లేదు. అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్నా సరే మధ్య ప్రాచ్య దేశాల్లో అమెరికా మాత్రం చాలా హడావుడి చేస్తుంది. ఇరాక్ లో అమెరికా బలగాలు ఇస్లామిక్ ఉగ్రవాదుల లక్ష్యంగా దాడులకు దిగినట్టు తెలుస్తుంది.

ఇరాక్ లోని బాస్రా ఫ్రావిన్స్ లో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఇరాక్‌లోని బాస్రా ప్రావిన్స్‌లోని అమెరికా నిర్వహిస్తున్న చమురు కంపెనీ స్థలాల సమీపంలో ఐదు రాకెట్లు సోమవారం ల్యాండ్ అయ్యాయని ఆ దేశ భద్రతా వర్గాలు తెలిపాయి. కాటియుషా రాకెట్లు అల్-జుబైర్ ప్రాంతంలోని హాలిబర్టన్ చమురు సంస్థ సమీపంలో ల్యాండ్ అయ్యాయని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఇరాక్ భద్రతా దళం సమీప ప్రాంతాల్లో సెర్చ్ క్యాంపెయిన్ నిర్వహించి,

రాకెట్ లాంచర్‌ను కనుగొన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ దాడి చేయడానికి ప్రధాన కారణం అమెరికా రెండు రోజుల క్రితం సైలెంట్ గా చేసిన దాడులే అని తెలుస్తుంది. ఇస్లామిక్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడి చేసిందని అందుకే ఈ దాడి జరిగిందని అంతర్జాతీయ మీడియా అంటుంది. అయితే ఈ దాడి చేసింది ఎవరు అనేది స్పష్టత రావాడ౦ లేదు. ఆ ప్రాంతంలో అమెరికాకు 5 వేల మంది బలగాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version