ఏపీ దెబ్బకు, పాపం తెలంగాణా మందుబాబులు…?

-

ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం ఏమో గాని, తెలంగాణా మందుబాబులు మాత్రం చుక్కలు చూస్తున్నారు. అదేంటి అంటారా…? ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం పేరుతో మద్యం ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇక సామాన్యులకు మద్యం అందుబాటులో లేకుండా చేసి౦ది జగన్ సర్కార్. దీనితో వాళ్ళు అందరూ తెలంగాణా మీద పడుతున్నారు. తెలంగాణా సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో భారీగా ఆంధ్రా వాళ్ళే మద్యం కొనుగోలు చేయడంతో ఇప్పుడు తెలంగాణా వాళ్లకు మందు దొరకడం లేదు.

తెలంగాణాలో ఆంధ్రా సరిహద్దులను పంచుకుని, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు ఉంటాయి. ఆంధ్రా జిల్లాలు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాలు సరిహద్దు పంచుకున్నాయి. దీనితో ఈ ఆరు జిల్లాల మందుబాబులు అందరూ తెలంగాణా మీద పడ్డారు. మూడు రోజుల నుంచి మద్యం భారీగా కొనుగోలు చేస్తున్నారు. చెక్ పోస్ట్ లు లేని ప్రాంతాల నుంచి మందు బాబులు తక్కువ ధరకు తెలంగాణాలో కొనుగోలు చేయడం విశేషం.

ఖమ్మం, నల్గొండ జిల్లాలకు అయిదు జిల్లాలు సరిహద్దులు ఉన్నాయి. దీనితో పల్నాడు, నందిగామ, ప్రాంతం వాళ్ళు అందరూ కూడా నల్గొండ మీద పడ్డారు. జంగారెడ్డి గూడెం, తిరువూరు, చింతలపూడి నుంచి వచ్చి సత్తుపల్లి, ఆశ్వారాపేట, దమ్మపేట మండలాల్లో భారీగా మద్యం కొనుగోలు చేస్తున్నారు. గ్రామాలకు గ్రామాలే సరిహద్దుల్లో ఉండటంతో అక్కడ పోలీసుల పహారా చాలా తక్కువ. దీనితో తెలంగాణా వాళ్లకు మద్యం దొరకడం ఇప్పుడు కష్టమైపోయింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు బ్లాక్ ఎక్కువ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version