ఆర్టీసీపై కేసీఆర్ షాకింగ్ డెసిష‌న్‌.. చైర్మ‌న్‌గా ఎవ్వ‌రూ ఊహించ‌ని వ్య‌క్తి

-

తెలంగాణ ఆర్టీసీ సమ్మె ముగిసింది. సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ చివరకు వాళ్ల‌పై వ‌రాలు కురిపించడంతో వాళ్ళంతా ఒక్కసారిగా కూల్ అయిపోయారు. ఎవరి పనుల్లో వారు జాయిన్ అయిపోయారు. సమ్మె కాలానికి కూడా జీతం ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఆర్టీసీ కార్మికులలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె కాలానికి కూడా జీతం ఇస్తామ‌ని కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో స‌మ్మె కాలంలో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వారంతా ఇప్పుడు ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఇక స‌మ్మె ముగియ‌డంతో తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్ గా కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి కి మంత్రి పదవి రాకపోవడంతో… ఆయనకు టిఆర్టీసీ చైర్మన్ పదవి ప్రచారం జరిగింది. అయితే ఆ పదవిలో ర‌సం లేద‌ని.. అది నాకు వద్దు అని చెప్పేశారు. ఇక ఇప్పుడు కేసీఆర్ పార్టీ తరఫున విశ్వాసంగా ఉంటున్న ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

cm kcr decided to offer tsrtc chairman post

ఈ క్ర‌మంలోనే టీ ఆర్టీసీ చైర్మన్ పదవిని సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆయ‌న నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి వ‌రుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నిజానికి బాజిరెడ్డి గోవర్ధన్‌కు రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి ఇస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ పోస్టును పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చిన కేసీఆర్… బాజిరెడ్డికి కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయ‌న సీనియ‌ర్ కోటాలో మంత్రి ప‌ద‌వి ఆశించినా.. అదే జిల్లాకు చెందిన ప్ర‌శాంత్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు గోవ‌ర్థ‌న్‌రెడ్డికి ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తున్న‌ట్టు టాక్‌..?

Read more RELATED
Recommended to you

Exit mobile version