తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల కిందట ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఇంకా అక్కడే ఉన్నారు. మూడో రోజు ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్.. బిజీ బిజీ గా గడుపుతున్నారు. BRS ప్రకటన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. కీలక సమావేశాలు, చర్చలు జరుగుతున్నారు.
ముఖ్యంగా దేశ రాజధాని అయిన ఢిల్లీలో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు కేసీఆర్. ఇక ఇవాళ జాతీయ నేతలు, ఆర్ధిక వేత్తలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇక రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి రానున్నారు సీఎం కేసీఆర్. కాగా, ములాయం సింగ్ అంత్యక్రియల నేపథ్యంలోనే మొన్న యూపీకి వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కడి నుంచి, అటే ఢిల్లీకి వెళ్లారు.