ఏపీకి, తెలంగాణకు కృష్ణా జలాల మధ్య ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. అయితే జగన్ సీఎం అయితే తర్వాత వీటిపై ఇరు రాష్ట్రాల సీఎంలు మొన్నటి దాకా సానుకూలంగానే ఉన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కేసీఆర్, జగన్ నిర్ణయించుకున్నారు. కానీ ఎప్పుడైతే ఏపీ కృష్ణా నదిపై పలు ప్రాజెక్టులకు నిర్మించాలని డిసైడ్ అయిందో అప్పటి నుంచి తెలంగాణ కూడా కాస్త ఫైటింగ్ స్టార్ట్ చేస్తోంది.
ప్రస్తుతం కృష్ణ బేసిన్ మీద ఏపీ చేపడుతున్న అనుమతిలేని ప్రాజెక్టులపై న్యాయపోరాటానికి రెడీ అవుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు కోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీని ఎత్తి చూపాలని నిన్న కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ డిసైడ్ అయింది.
అలాగే ఏపీకి ధీటుగా కృష్ణ బేసిన్ లో తెలంగాణ వాటాలకు కొత్తగా ప్రాజెక్టులను నిర్మించాలని కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న జోగులాంబ బ్యారేజీ పేరుమీద అలంపూర్ వద్ద కృష్ణ నీళ్లపై కొత్తగా బ్యారేజీని నిర్మించడానికి ఓకే చెప్పింది. ఈ ప్రాజెక్టు ద్వారా 60నుంచి 70 టీఎంసీల వరదనీటిని ఏదుల రిజర్వాయర్ కు ఎత్తిపోయాలని భావిస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నడుమ మళ్లీ నీటి వివాదం తారా స్థాయికి చేరే అవకాశం ఉంది.