గ్రాస్ , పెట్రోల్ ధరలు పెరిగాయి.. జీఎస్టీతో నేతన్న నడ్డివిరిచింది : సీఎం కేసీఆర్‌

-

మునుగోడు ఉప ఎన్నిక నవంబరు 3న జరగనుండగా, టీఆర్ఎస్ పార్టీ నేడు చండూరులో రణభేరి సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు విచ్చేసిన సీఎం కేసీఆర్ ప్రధానంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వడ్లను కొనడం చేతకాని బీజేపీకి..వంద కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం చేతనైతదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని పన్నాగం పన్నిన బీజేపీకి మునుగోడు ప్రజలు ఓటు ద్వారా బుద్దిచెప్పాలని కోరారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్‌. అన్యాయం జరిగింది.. గ్రాస్ , పెట్రోల్ ధరలు పెరిగాయని అంటున్న ప్రజలు..వాటిపై పోరాడాలంటే టీఆర్ఎస్కు బలం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

కత్తి ఒకడి చేతిలో పెట్టి..యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎలా అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. నేతన్న సంక్షేమం కోసం టీఆర్ఎస్ కృషి చేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో రూ. 70 కోట్లు ఉన్న చేనేత బడ్జెట్ను టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 1200 కోట్లు పెంచామన్నారు. అలాగే చేనేత బీమా పథకాన్ని తెచ్చామని చెప్పారు సీఎం కేసీఆర్‌. రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. దేశంలో రైతు బీమా ఎక్కడా లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే..కేంద్రం ఉచిత పథకాలు ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తోందన్నారు సీఎం కేసీఆర్‌. దేశ వ్యాప్తంగా వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తే ఏడాదికి లక్షా 45 వేల కోట్లు ఖర్చవుతాయన్నారు. కానీ రూ. 14 లక్షల కోట్లు కార్పొరేట్ గద్దలకు ఇచ్చిన మోడీ…రైతులకు ఉచిత కరెంట్ మాత్రం ఇవ్వడం లేదన్నారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version