కోమటిరెడ్డి రెండు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారు : కేసీఆర్‌

-

కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతకుముందు కూడా రెండు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉన్నారని, కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఏం చేశారు? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. సోమవారం నల్గొండలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్గొండ ఎలా ఉంది? మంచి నీళ్ళు వచ్చాయా? కరెంట్ మాటేమిటి? అసలు ఏ పనులైనా చేశాడా? మరి అదే నల్గొండ ఇప్పుడు ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు.

న‌కిరేక‌ల్‌లో మేం గెలిచిన త‌ర్వాత రామ‌న్నపేట నుంచి న‌కిరేక‌ల్ దాకా అంద‌ర్నీ పండ‌వెట్టి తొక్కుతం అని మాట్లాడుతున్నారు. ఈ పండ‌వెట్టి తొక్కేటోళ్లే కావాల్నా ఎమ్మెల్యేలు..? వీళ్లేనా మ‌న‌కు కావాల్సింది. భూపాల్ రెడ్డి ఓడినా, గెలిచినా ప్రజ‌ల్లో ఉన్న వ్యక్తి. గ‌తంలో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఓడినా.. గెలిచినా అదే ఇంట్లో ఉన్నాడు త‌ప్ప ఇల్లు కూడా మార్చలేదని అన్నారు. న‌ల్లగొండ నియోజ‌క‌వ‌ర్గం మంచిగా అభివృద్ధి జ‌రుగుతున్నది. దీన్ని ఇదే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత న‌ల్లగొండ వాసుల మీద ఉన్నది. ఏదో క‌ల్లబొల్లి మాట‌లు న‌మ్మి గంద‌ర‌గోళ‌మైతే న‌ష్టపోయేది మీరే అని కీలక వ్యాఖ్యలు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version