తెలంగాణలో తొలి విడతలో 50 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు నియామక ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నూతన జోన్ల విధానానికి అడ్డంకులు తొలగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ప్రమోషన్లు ద్వారా ఏర్పడే ఖాళీలు రెండో దశలో భర్తీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.
మొదటి దశలో 50 వేల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని… దీని కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్న సీఎం కేసీఆర్… స్థానికులకు న్యాయం కోసం కొత్త జోనల్ వ్యవస్థ తీసుకొచ్చామని పేర్కొన్నారు. జోన్ల వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదంతో అడ్డంకులు కూడా తొలగి పోయాయని వెల్లడించారు. ఖాళీల సమాచారం కేబినెట్ కు అధికారులు తీసుకు రావాలని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వం తాజా ప్రకటనతో నిరుద్యోగులలో కొత్త ఉత్సాహం నెలకొంది.