తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. జనగామ జిల్లాలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనంతో పాటు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభిస్తారు. అనంతరం సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. కాగ మూడు సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టరేట్ శంకుస్థాపన చేశారు. సూర్యపేట్ రోడుకు దాదాపు 25 ఎకరాల్లో కలెక్టరేట్ ను నిర్మించారు.
రూ. 32 కోట్ల బడ్జెట్ తో మూడు అంతస్తుల్లో కలెక్టరేట్ ను నిర్మించారు. మొత్తం 34 శాఖలు ఒకే బిల్డింగ్ ఉండేలా ఈ భవనాన్ని నిర్మించారు. ఈ కలెక్టరేట్ ను ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లా గులాబీమయం అయింది.
ముఖ్యంగా తగ్గేదేలే ఇది కేసీఆర్ అడ్డా అని భారీ బెలూన్ సహాయంతో ఏర్పాటు చేసిన ప్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే సరిలేరు నీకేవరూ అనే పోస్టర్ కూడా హల్ చల్ చేస్తోంది. మొత్తానికి.. కేంద్రంపై ఇవాళ సీఎం కేసీఆర్.. ఓ రేంజ్ లో ఫైర్ కానున్నట్లు ఆ ప్లెక్సీలు చూస్తేనే అర్థమౌవుతుంది.