రాజమండ్రి, విశాఖపట్నం నుంచి ఉత్తర భారతదేశ టూర్.. తక్కువ ధరకే వీటన్నింటినీ చూసొచ్చేయచ్చు..!

-

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ వివిధ టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. దీనితో ఈజీగా టూర్ వెయ్యాలని అనుకునే వారు తక్కువ డబ్బులతోనే మంచిగా నచ్చిన ప్రాంతాలని చూసి వచ్చేయచ్చు. పైగా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్తోంది. అయితే తాజాగా ‘ఉత్తర భారత్ దర్శన్ విత్ మాతా వైష్ణో దేవి’ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

IRCTC

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి ఈ ట్రైన్ మొదలు అవుతుంది. మొత్తం 8 రాత్రులు, 9 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మార్చి 19న టూర్ స్టార్ట్ అవుతుంది. 27న టూర్ ముగుస్తుంది. ఈ టూర్ లో భాగంగా ఆగ్రా, మథుర, మాతా వైష్ణోదేవి, అమృత్‌సర్, హరిద్వార్ మొదలైన ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాసలో భారత్ దర్శన్ టూరిస్ట్ రైలు ఎక్కచ్చు. రెండో రోజు ఆగ్రా చేరుతారు. అక్కడే స్టే చెయ్యాల్సి వుంది.

మూడో రోజు ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్ చూడచ్చు. నెక్స్ట్ మథుర బయల్దేరాలి. అక్కడ కృష్ణ జన్మభూమి చూసి.. శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రాకు వెళ్ళాలి. నాలుగో రోజు మాతా వైష్ణోదేవి కాట్రాకు వెళ్తారు. ఐదో రోజు వైష్ణోదేవి యాత్ర ఉంటుంది. కాలినడకన లేదా పోనీ సర్వీస్ ద్వారా వెళ్లొచ్చు. ఆరో రోజు శ్రీ మాతా వైష్ణో దేవి దర్శనం ఉంటుంది.

ఆ తర్వాత అమృత్‌సర్ బయల్దేరాలి. గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్ చూసి హరిద్వార్ బయల్దేరాలి. ఏడో రోజు హరిద్వార్ చేరుకుంటారు. ఆ రోజంతా సైట్ సీయింగ్ ఉంటుంది. మానస దేవి మందిర్ దర్శించుకోవచ్చు. సాయంత్రం గంగా హారతి చూడచ్చు. ఎనిమిదో రోజంతా ప్రయాణం ఉంటుంది. తొమ్మిదో రోజు ప్రయాణికులు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ప్యాకేజీ ధర రూ.8510 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.10,400.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version