తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీఎం ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమాశేశయ్యారు. కాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను రేపు ( సోమవారం) కలిసే అవకాశం ఉంది. ఈ సంధర్బంగా షెకావత్ తో సీఎం ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదం పై చర్చించనున్నారు.
అంతే కాకుండా కేసీఆర్ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ను కూడా కలిసి యాదాద్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నట్లు సమాచారం. గత ఐదు రోజులుగా ఢిల్లీలో సీఎం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణ శంకుస్థాపన కోసం సీఎం వచ్చారు.