తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్ లో టీఆర్‌ఎస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో 14 నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరి వంటి తదితర అంశాలపై కూడా ఈ భేటీలో మాట్లాడనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
కాగా, ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సీఎం కేసీఆర్ సహా ఇతల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇకపోతే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.