సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఇవాళ్టి నుంచి దేశ వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్న సీఎం కేసీఆర్…. అదే సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇక మే 22 వ తేదీన మధ్యాహ్నం…. ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీనుంచి చంఢీఘర్ పర్యటన చేపడతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సిఎం కెసిఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు.
ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని… ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి సిఎం కెసిఆర్ చేపడతారు. సంచలనం సృష్టించిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన.. పంజాబ్, హర్యాన, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులను అందచేస్తారు. ఇక ఈ నెల 26వ తేదీన బెంగళూరులో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్.