మన దేశంలో బంగారం ధరలు చుక్కలు చూపిస్తోన్నాయి. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి.
తాజాగా మరో సారి బంగారం ధరలు పెరిగిపోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 46, 300 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 50, 510 కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ఇక తాజాగా కిలో వెండి ధర రూ. 400 కి తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 65,000 గా నమోదు అయింది.