నేడు దిశ ఎన్కౌంటర్ కేసు పై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. దిశ ఎన్కౌంటర్ కేసు పై కమిషన్ ను ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు..ఈ కేసును సుదీర్ఘ విచారణ చేసి జనవరిలో సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది సిర్పూర్కర్ కమిషన్. ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురు కుటుంబసభ్యుల స్టేట్మెంట్లను రికార్డు చేసింది కమిషన్. ఎన్ కౌంటర్ లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిని విచారణ చేసింది. బాధిత దిశ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేసి నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది.
ఈ నివేదిక ప్రకారం ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ పై విచారణ చేపట్టిన జస్టిస్ సిర్పూర్కర్ కమీషన్ తన నివేదికను జనవరి 28 (శుక్రవారం) సుప్రీం కోర్టుకు సమర్పించింది. 47 రోజుల పాటు 57 మంది సాక్షులను విచారించి కమిషన్.. ఫోరెన్సిక్ నివేదికలు, పోస్ట్ మార్టం నివేదికలు, ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్ తోపాటు వివిధ డాక్యుమెంటరీలను సేకరించింది.