తెలంగాణ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై ప్రచారంలో ఉండగా కత్తితో దాడి చేయడం హేయమైన చర్య అంటూ సీఎం కేసీఆర్ ఖండించారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఎప్పుడూ కూడా ఇలాంటి హింసలు జరగలేదని కేసీఆర్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదు అంటూ కేసీఆర్ మండిపడ్డారు. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి చేయడం అంటే నాపై జరగడమే అంటూ కేసీఆర్ ఎమోషనల్ కామెంట్ చేశారు, ఈ ఘటన జరగడం చాలా సిగ్గు చేటు అంటూ అభిప్రాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలియడంతో వెంటనే సభలన్నీ రద్దు చేసుకుని ప్రభాకర్ రెడ్డిని చూడడానికి వెల్దామనుకున్నా, కానీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం గురించి హరీష్ రావు ప్రాణాపాయం ఏమీ లేదంటూ అప్డేట్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుని ఆగిపోయానంటూ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ప్రజలకు సేవ చేసే వారిపైన హత్య రాజకీయాలు చేసే ఆలోచనలు ఇకనైనా మానుకోవాలని కేసీఆర్ హెచ్చరించారు. ఇకపై ఎవరు దాడులకు పాల్పడినా సహించేది లేదంటూ సవాలు విసిరారు.