క‌రోనా వ్యాప్తి పై సీఎం కేసీఆర్ స‌మీక్ష

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో ముఖ్య మంత్రి కేసీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి గురించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి తెలుసుకున్నారు. స‌మావేశం అనంత‌రం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ క‌రోనా వైర‌స్, ఓమిక్రాన్ వేరియంట్ ప‌ట్ల ప్ర‌జ‌లు జగ్ర‌త్తగా ఉండాల‌ని సూచించారు.

ప్ర‌జ‌లంద‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని అన్నారు. ప్ర‌జ‌లే స్వీయ నియంత్ర‌ణ చర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం కేసీఆర్ సూచించిచారు. అలాగే క‌రోనా, ఓమిక్రాన్ ల వ్యాప్తి ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా భ‌యాందోళ‌న చేంద‌కుడ‌ద‌ని తెలిపారు. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ని అరిక‌ట్ట‌డానికి ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో అన్ని సౌక‌ర్యాలు చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ఆక్సిజ‌న్ బెడ్స్ తో పాటు మ‌రిన్నీ ఏర్పాట్టు చేస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ వివ‌రించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version