గ్రామీణాభివృద్ధి కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యం : సీఎం కేసీఆర్

-

తెలంగాణకు అవార్డుల పంటపండటంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి ఇతివృత్తంతో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయి. పల్లె ప్రగతి సహా గ్రామీణాభివృద్ధి దిశగా దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్పూర్తితో తెలంగాణ ఆదర్శంగా దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధికోసం కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లోని తొమ్మిది విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేయగా.. ఎనిమిది విభాగాల్లో తెలంగాణ అవార్డులను సాధించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయని అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోవడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులను సీఎం అభినందించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version