Breaking : మళ్లీ పాత వాళ్ళకే టికెట్స్.. ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పిన కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం నేడు జరిగింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌స‌క్తే లేదని తేల్చిచెప్పారు సీఎం కేసీఆర్‌. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ ప్రారంభ‌మైన ఈ స‌మావేశంలో అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌న్న‌ద్ధ‌త‌తో పాటు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే అంశంపై చ‌ర్చించారు సీఎం కేసీఆర్‌. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్‌. మ‌ళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామ‌ని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల స‌మ‌యమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి. ప్ర‌తి ఎమ్మెల్యే నిత్యం ప్ర‌జ‌ల‌తో మాట్లాడాలి అని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఏవైనా స‌మ‌స్య‌లుంటే ప్ర‌భుత్వం దృష్టికి తేవాల‌ని కేసీఆర్ సూచించారు సీఎం కేసీఆర్‌. స‌ర్వేల‌న్ని టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వంద శాతం మ‌ళ్లీ టీఆర్ఎస్‌దే అధికార‌మ‌ని తేల్చిచెప్పారు. మునుగోడు త‌ర‌హాలో ప‌టిష్ట ఎన్నిక‌ల వ్యూహం త‌యారు చేయాల‌ని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా ప‌ని చేయాలి. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. ల‌బ్దిదారుల పూర్తి స‌మాచారం ఎమ్మెల్యేల వ‌ద్ద ఉండాలి. ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌లు నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాలి. ప్ర‌జ‌ల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించాలి. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల బ‌లంతో ఓట‌ర్లంద‌రినీ చేరుకోవాల‌ని సూచించారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version