దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

-

నేడు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. దేశంలో ఉన్న రాముని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే అర్చకులు సీతారాములకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు.. రాష్ట్ర‌, దేశ ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ్రీరామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు. సీతారామ‌చంద్ర‌మూర్తుల‌ను త‌మ ఆరాధ్య దైవాలుగా, ఇల‌వేల్పుగా హిందువులు కొలుచుకుంటార‌ని అన్నారు. శ్రీరాముని జీవితం త‌ర‌త‌రాల‌కు ఆద‌ర్శం, స్ఫూర్తిదాయ‌కం అని తెలిపారు. ఆద‌ర్శ‌వంత‌మైన జీవ‌నాన్ని కొన‌సాగించేందుకు శ్రీరామ న‌వ‌మి ఒక ప్ర‌త్యేక సంద‌ర్భం అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంతో పాటు యావ‌త్ భార‌త‌దేశం సుభిక్షంగా వ‌ర్ధిల్లాల‌ని, ప్ర‌జ‌లంద‌రూ సుఖ‌శాంతుల‌తో జీవించాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు కేసీఆర్ చెప్పారు.

రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయం భద్రాచలం సీతారామ స్వామి ఆలయంలో ఇవాళ రాముల వారి కల్యాణం అట్టహాసంగా జరగనుంది. ఈ వేడుకలను తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహిస్తోంది. ఇటీవలే కేసీఆర్ భద్రాద్రి సీతారాముల కల్యాణానికి కోటి రూపాయల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version