శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా..నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

-

శ్రీరామ నవమి వేడుకలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. ఇవాళ నగరంలో జరగనున్న ​ శ్రీరాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీతారాంబాగ్​లోని రామాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగనుంది. ఈ యాత్రలో నగరవ్యప్తంగా పలువురు ప్రజా ప్రతినిధులు, రామయ్య భక్తులు పాల్గొననున్నారు.

శ్రీరామ శోభాయాత్ర సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా శోభాయాత్ర సాగే మార్గంలో ఆంక్షలు విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్ – మంగళహాట్ పీఎస్ – పురానా పూల్ – బేగంబజార్​ – సిద్ధంబర్ ​బజార్ – గౌలిగూడ – గురుద్వారా – రాంమందిర్ ​- తిలక్​ పార్క్ – పుత్లిబౌలి – కోఠి ఆంధ్రాబ్యాంక్ – బడి చౌడి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరనుంది. అంబర్​పేట్​ నుంచి, ఫిలింనగర్ నుంచి మరి కొన్ని శోభాయాత్రలు కోఠి వ్యాయామశాలకు వస్తాయన్నారు.

ఆకాశ్ పురి నుంచి మరో శోభాయాత్ర దూల్​పేట్​ కూడలి వద్ద కలవనుంది. శాంతియుతంగా ఈ శోభాయాత్ర నిర్వహిస్తామని.. శోభాయాత్రకు వచ్చే భక్తులకు దారి పొడవున అన్న పానీయాలు అందుబాటులో ఉంటాయని పోలీసులు  స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version